కేంద్రం: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్..!

-

పన్ను చెల్లింపుదారులకు (Tax Payers) ఆదాయపు పన్ను శాఖ తీపికబురు చెప్పింది. నేటి నుండి కొత్త సర్వీసులని తీసుకు రావడం జరిగింది. సరి కొత్త ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త పోర్టల్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే…

 

పన్ను | Tax Payers

పన్ను చెల్లింపుదారులకు పలు రకాల ప్రయోజనాలు లభించనున్నాయి. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఇఫైలింగ్ పోర్టల్ 2.0 ద్వారా పన్ను చెల్లింపుదారులకు కొన్ని బెనిఫిట్స్ కలగనున్నాయి.

దీని ద్వారా ఏయే ఫీచర్లు అందుబాటులో వున్నాయి అనేది చూస్తే..

ఈ కొత్త పోర్టల్ ద్వారా వెంటనే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. అదే విధంగా దీని వలన రిఫండ్ కూడా వేగంగానే వస్తుంది. అలానే కొత్త ఇఫైలింగ్ సైట్ ఆవిష్కరణ తర్వాత మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి వస్తోంది.

ఇప్పుడు సరి కొత్త డ్యాష్‌ బోర్డు కూడా ఇప్పుడు కనిపిస్తుంది. దీనిలో ఇంటరాక్షన్లు కూడా మీకు డిస్‌ప్లై అవుతాయి. అప్‌లోడ్స్, పెండింగ్ ట్రాన్సాక్షన్లు వంటివి కూడా కనిపిస్తాయి. దీని ద్వారా ట్యాక్స్ పరిధిలోకి రాని వారు కూడా ఐటీఆర్ ఎలా దాఖలు చేయాలో నేర్చుకో వచ్చు.

ట్యుటోరియల్, చాట్ బాట్, లైవ్ ఏజెంట్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. అంతే కాదండి నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డు, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ వంటి పలు రకాల పేమెంట్ ఆప్షన్లు కూడా వున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version