ఇలా చేస్తే ఎఫ్‌డీలను మెచూరిటీ కంటే ముందే డ్రా చేసుకున్నా పెనల్టీ పడదు!

-

సాధారణంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఎక్కువ శాతం వడ్డీ వస్తుందని చాలా మంది ఎక్కువ శాతం వరకు అందులోనే డిపాజిట్‌ చేస్తారు. అంతే కాదు ఈ ఎఫ్‌డీల్లో డిపాజిట్‌ చేస్తే మనకు ఆదాయం కూడా వస్తుంది. కానీ, ఈ ఎఫ్‌డీల్లో డిపాజిట్‌ చేయడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వాటిని విత్‌డ్రా చేసుకోవడానికి వీలుండదు. ఒకవేళ ఎఫ్‌డీలో ఉండే డబ్బును వెనక్కి తీసుకుంటే దానికి మనం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు వడ్డీ రేటును కూడా తగ్గించేస్తారు.

దీన్ని అధిగమించడానికి కొన్ని బ్యాంకులు స్వీప్‌ ఇన్‌ అకౌంట్స్‌ స్టార్ట్‌ చేశాయి. దీని వల్ల ఖాతాదారులకు కూడా లాభం వస్తుంది. అదే విధంగా లిక్విడిటీ కి ఉపయోగపడుతుంది. దీంట్లో లాక్‌ ఇన్‌ ఉండదు. సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల వడ్డీ రేట్ల మాదిరిగానే వడ్డీ వస్తుంది. దీనిలో కనీస నిల్వను ఖాతాదారుడు నిర్ణయించుకోవాలి. దానికి మించి డిపాజిట్‌ చేస్తే ఎఫ్‌డీలోకి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఖాతాదారుడికి డబ్బు అవసరమైనపుడు సేవింగ్స్‌ అకౌంట్లోకి స్వీప్‌ ఇన్‌ అయిపోతుంది.

ఒకవేళ మీ ఖాతాలో రూ.2 లక్షలుంటే, కాల పరిమితి రూ. 20 వేలు. మిగిలిన డబ్బులు రూ.180,000 ఫిక్స్‌డ్‌ ఖాతాలోకి వెళ్లిపోతుంది. అయితే ఖాతాదారుడి ఇష్టానుసారం మదుపు చేసేందుకు కొన్ని బ్యాంకులు మాత్రమే అనుమతినిస్తున్నాయి. దీంట్లో కనీస నిల్వ రూ.1000–10,000 ఉండాలి. అదేవిధంగా కొన్ని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కాలపరిమితి ఏడాది మాత్రమే. స్వీప్‌ ఇన్‌ అకౌంట్ల ద్వారా తక్కువ పన్నులోకి వచ్చే ఖాతాదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే సెక్షన్‌ 80 టీటీఏ ప్రకారం పది వేలకు తక్కువ ఆదాయం ఉన్నవారికి పన్ను వర్తించదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version