వాట్సాప్ నుంచి ఆధార్ కార్డును ఇలా ఈజీగా పొందండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. ప్రభుత్వ స్కీమ్స్ లో జాయిన్ అవ్వాలన్నా లేదా ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలన్నా సరే ఆధార్ కార్డు కచ్చితంగా కావాలి. అయితే ఒక్కోసారి మనం ఆధార్ ని మరచిపోతూ ఉంటాం. ఆధార్ ని కనుక అప్పటికపుడు పొందాలంటే ఇలా వాట్సాప్ ద్వారా పొందొచ్చు. మరి ఆధార్ ని వాట్సాప్ ద్వారా ఎలా డౌన్ లోడ్ చెయ్యచ్చనేది ఇప్పుడు చూద్దాం.

వాట్సాప్ ద్వారా ఆధార్ ని ఇలా పొందొచ్చు:

దీని కోసం ముందుగా మీరు మీ ఫోన్ లో +91-901315151515 మొబైల్ నెంబరును MyGov హెల్ప్ డెస్క్‌తో సేవ్ చెయ్యండి.
ఇప్పుడు మీరు మీ ఫోన్ లో వాట్సాప్ ని ఓపెన్ చెయ్యండి.
MyGov హెల్ప్ డెస్క్‌తో మీ చాట్ బాక్స్ ని ఓపెన్ చేయండి.
ఇక్కడ హాయ్ అని మెసేజ్ చెయ్యండి.
చాట్ బాక్స్ డిజిలాకర్, కోవిన్ అనే ఆప్షన్స్ వస్తాయి. డిజిలాకర్ ని సెలెక్ట్ చేయండి.
ఇప్పుడు మీకు డిజిలాకర్ ఖాతా వుందా అని అడుగుతుంది. ఉంటే అవును మీద క్లిక్ చేయండి. అదే లేదంటే లేదు మీద క్లిక్ చెయ్యండి.
ఖాతా లేనట్లయితే డిజిలాకర్ యాప్ లేదా సైట్ కి వెళ్లి పొందండి.
నెక్స్ట్ మీరు ఆధార్ కార్డు నెంబరును ఎంటర్ చెయ్యండి.
తరవాత ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసేయండి. మీ డిజిలాకర్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ వస్తాయి.
ఆధార్ కార్డు కోసం 1 పంపాల్సి ఉంటుంది. ఒకేసారి 1 పంపిన వెంటనే ఆధార్ కార్డును పిడిఎఫ్ ఫార్మాట్ లో మీరు పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version