కేంద్రం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి ఏటా రెండు వేల చొప్పున రైతుల అకౌంట్‌లో నగదును జమ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో 2022-23 సంవత్సరానికి తొలి విడతగా మంగళవారం ప్రధాన మంత్రి కేంద్రం నుంచి నిర్వహించే కార్యక్రమంలో మీట నొక్కి రైతుల ఖాతాలో నగదు జమచేయనున్నారు. ఒక్కో రైతుకు రూ.2 వేలు చొప్పున బ్యాంకులోని వారి వ్యక్తిగత ఖాతాలో నగదు జమకానుంది. పీఎం కిసాన్ యోజన కింద గుర్తించిన రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వంఈ దఫా రూ. 20 వేల కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలోకి జమ చేశారు. దేశ వ్యాప్తంగా 10 కోట్ల మందికిపై రైతులకు ఈ డబ్బులు అందనున్నాయి. రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు జమచేశారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 11 విడతలు నగదు జమచేశారు.. నగదు అందని వాళ్ళు సంభంధిత అధికారులను సంప్రదించగలరు.
డబ్బులు పడ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి..
పీఎం కిసాన్ నిధి ఆర్థికసాయం తమ ఖాతాలో పడిందా లేదా అనే విషయాన్ని రైతులు pmkisan.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌లో Kisan Corner అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత స్టేటస్‌లోకి వెళ్లాలి. అక్కడ లబ్దిదారులు తమ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, గెట్ రిపోర్ట్‌ను క్లిక్ చేస్తే పూర్తి వివరాలు పొందవచ్చు.
ఒకవేళ నగదు రైతుల అకౌంట్‌లోకి జమకాకపోయినా.. రిపోర్టులో FTO (Fund Transfer Order) అని వచ్చినట్టయితే.. లబ్దిదారులు నిరాశ చెందాల్సిన పని లేదు. త్వరలోనే మీ ఖాతాలో డబ్బులు వేస్తారని అర్థం.
పీఎం కిసాన్ టోల్‌ఫ్రీ నంబర్ (PM Kisan Toll free number): 18001155266.
పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ ( PM Kisan Helpline number): 155261.
పీఎం కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్లు (PM Kisan landline numbers): 011—23381092, 23382401, 011-24300606. 0120-6025109.
పీఎం కిసాన్ ఈమెయిల్ ఐడీ: pmkisan-ict@gov.in .