డిజిట‌ల్ ఓట‌రు ఐడీ కార్డును ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్‌..!

-

జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) డిజిటల్ ఓటరు ఐడీ కార్డుల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (ఈ-ఈపీఐసీ) అని పిల‌వబడే ఈ డిజిటల్ ఓటరు ఐడీ కార్డు మ‌న‌కు పీడీఎఫ్ ఫైల్ రూపంలో లభిస్తుంది. ఈ-ఈపీఐసీ ఈ-ఆధార్ లాగా ప‌నిచేస్తుంది. దీన్ని ఎడిట్ చేసేందుకు వీలు కాదు.

గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఓటరు ఐడీ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే జనవరి 31 వరకు డిజిటల్ ఓట‌ర్ ఐడీ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. త‌రువాత ఫిబ్రవరి 1 నుండి ఎవ‌రైనా స‌రే డిజిటల్ ఓటరు ఐడీ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఓటరు ఐడీ కార్డులను కోల్పోయిన వారు డూప్లికేట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని కోసం రూ. 25 వసూలు చేస్తున్నారు.

జనవరి 25, 1950న ఎన్నికల కమిషన్ ను ఏర్పాటు చేసిన సంద‌ర్భంగా దాని జ్ఞాప‌కార్థం ఈ-ఈపీఐసీల‌ను పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు. భౌతిక కార్డులను ముద్రించడానికి, వాటిని పంపిణీ చేయడానికి సమయం పడుతుండడంతో ఆలస్యం జరగకుండా ఉండేందుకు గాను కార్డుల‌ను డిజిటలైజ్ చేసి అందిస్తున్నారు.

అయితే ఈ కార్డుల‌ను ఓట‌ర్లు ఆన్‌లైన్ నుంచి ఇలా డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.

* voterportal.eci.gov.in. అనే సైట్‌ను సంద‌ర్శించి సంబంధిత వివ‌రాల‌ను న‌మోదు చేసి అకౌంట్‌ను క్రియేట్ చేయాలి.

* అకౌంట్‌ను క్రియేట్ చేసిన తర్వాత లాగిన్ అయి ఈ-ఈపీఐసీని డౌన్‌లోడ్ చేసుకోండి అని సూచించే మెనూకు వెళ్లాలి.

* మీ EPIC సంఖ్యను లేదా ఫాం రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేయాలి. దీంతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP) పంపబడుతుంది.

* “డౌన్‌లోడ్ EPIC” పై క్లిక్ చేయాలి. అయితే కార్డులో పేర్కొన్న మొబైల్ నంబర్ భిన్నంగా ఉంటే కార్డును డౌన్‌లోడ్ చేయడానికి నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయాలి.

* కేవైసీ ద్వారా నంబర్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, మీరు మీ డిజిటల్ ఓటరు ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

* మీరు మీ ఈ-ఈపీఐసీ నంబర్‌ను కోల్పోతే voterportal.eci.gov.in లో తనిఖీ చేయవచ్చు.

* డిజిటల్ ఓటరు ఐడీ కార్డును ఓటర్ మొబైల్ యాప్ నుండి కూడా డౌన్‌లోడ్‌ చేయవచ్చు, అందుకు ఆ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version