IRCTC ప్యాకేజ్: హైదరాబాద్ నుండి హంపీ టూర్.. వివరాలు ఇవే..!

-

ఐఆర్సీటీసీ IRCTC గతంలో కూడా అద్భుతమైన టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఇప్పుడు కూడా హెరిటేజ్ హంపి పేరుతో హైదరాబాద్ నుంచి ఒక టూర్ ప్యాకేజీని తీసుకు రావడం జరిగింది. ఇక ఈ టూర్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

ఈ టూర్ ప్యాకేజీలో బళ్లారి, హోస్‌పేట్, హంపి, బాదామి కవర్ అవుతాయి. ఈ టూర్ ఆగస్ట్ 19న ప్రారంభం కానుంది. మొత్తం ఈ టూర్ మూడు రాత్రులు, నాలుగు రోజుల టూర్. ఇక ధర విషయానికి వస్తే.. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.15,350. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,970, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.18,010 చెల్లించాలి. ఇవన్నీ కంఫర్ట్ ప్యాకేజీ ధరలు.

అదే డీలక్స్ ధరల వివరాలు చూస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.17,130, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.18,060, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.21,950 చెల్లించాలి. 3 బ్రేక్‌ఫాస్ట్‌, 3 డిన్నర్‌, 2 లంచ్‌, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, స్టే, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఇక టూర్ గురించి చూస్తే..

మొదటి రోజు:

ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో టూర్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 08:20 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్. 09:25 గంటలకు బళ్లారి విద్యానగర్ ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడ నుండి హోస్‌పేట్ వెళ్ళాలి. హోటల్ కి వెళ్ళాక అనెగుడి, పంపసరోవర చూసి.. సాయంత్రం తుంగభద్ర డ్యామ్ సందర్శించొచ్చు.

రెండో రోజు:

సెకండ్ డే హంపి సైట్ సీయింగ్ ఉంటుంది. అలానే ఇక్కడ విఠ్ఠల ఆలయం, హనుమాన్ విగ్రహం, విరూపాక్ష ఆలయం, క్వీన్స్ బాత్, ఎలిఫెంట్ స్టేబుల్, లోటస్ మహల్ చూడచ్చు.

మూడవ రోజు:

థర్డ్ డే బాదామికి వెళ్ళాలి. ఇక్కడ బాదామి గుహలు చూడొచ్చు. నెక్స్ట్ అయిహోల్ ఆలయం, పట్టడక్కల్ కట్టడాలు ఉంటాయి. సాయంత్రం తిరిగి హోస్‌పేట్ బయల్దేరాలి.

నాలుగో రోజు:

ఉదయం బళ్లారి విద్యానగర్ ఎయిర్‌పోర్టుకు బయల్దేరాలి. సాయంత్రం 5.15 గంటలకు బళ్లారి విద్యానగర్ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 6.20 గంటలకు హైదరాబాద్ రీచ్ అవుతారు. పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version