రోజూ రూ.7 పొదుపు చేస్తే రూ.5,000 పెన్షన్ పొందొచ్చు..!

-

మీ డబ్బుల్ని ఏదైనా పథకం లో పొదుపు చేసి.. రిటైర్ అయ్యాక పెన్షన్ పొందాలనే ఆలోచనలో ఉన్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఈ పెన్షన్ లో ప్రతీ నెలా డబ్బులు పెడితే అదిరే లాభాలని పొందొచ్చచు. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే.. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. రూ.7 పొదుపు చేస్తే ఏటా రూ.60,000 పొందొచ్చు. రిటైర్మెంట్ వయస్సు నుంచి నెలకు రూ.5,000 చొప్పున ఏటా రూ.60,000 పెన్షన్ లభిస్తోంది.

డబ్బులు

రిటైర్మెంట్ తర్వాత ఆర్ధిక ఇబ్బందులు వుండవు. ఇప్పటి నుంచే ఈ పథకంలో పొదుపు చేస్తే చాలు. రిటైర్మెంట్ తర్వాత ఫిక్స్‌డ్ పెన్షన్ వస్తుంది. ఇందులో డబ్బులు పెట్టాలంటే కనీస వయస్సు 18 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 40 ఏళ్లు ఉండాలి. ఈ స్కీమ్‌లో చేరినా 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తూ ఉండాలి. ప్రతీ నెల కనీసం రూ.42 నుంచి పొదుపు చేయొచ్చు. గరిష్టంగా రూ.1,454 పొదుపు చేయొచ్చు.

ఈ స్కీమ్‌లో కనీస పెన్షన్ రూ.1,000 లభిస్తుంది. గరిష్టంగా నెలకు రూ.5,000 పెన్షన్ లభిస్తుంది. అయితే జమ చేసే దాని బట్టి పెన్షన్ వస్తుంది గమనించండి. నెలకు రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000, రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. 18 ఏళ్ల వయస్సు ఉన్నవారు రూ.1,000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.42 చొప్పున, రూ.2,000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.84 చొప్పున జమ చేయాలి. రూ.126 చొప్పున కడితే రూ.3,000 పెన్షన్ వస్తుంది. రూ.168 చొప్పున కడితే రూ.4,000 పెన్షన్ వస్తుంది. రూ.210 చొప్పున జమ చేస్తే రూ.5,000 పెన్షన్ వస్తుంది. అంటే రోజుకు రూ.7 పొదుపు చేస్తే చాలు. రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5,000 పెన్షన్ పొందొచ్చు

Read more RELATED
Recommended to you

Exit mobile version