యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రస్తుతం దేశంలోని ప్రజలకు ఆధార్ సెంటర్ల వద్దకు వెళ్లకుండానే ఇంట్లో నుంచే ఆన్లైన్లో పలు వివరాలను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అయితే బయోమెట్రిక్ వివరాలు మార్చాలన్నా, ఫోన్ నంబర్‌ను అప్డేటా చేయాలన్నా.. ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండా ఇతర సేవలు పొందాలన్నా.. కచ్చితంగా ఆధార్ సేవా కేంద్రాలను సందర్శించాల్సి వస్తోంది. దీంతో కొందరికి ఆధార్ కేంద్రాలు తమకు సమీపంలో ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు. అయితే కింద తెలిపిన స్టెప్స్ పాటిస్తే ఎవరైనా సరే తమకు సమీపంలో ఉండే ఆధార్ సేవా కేంద్రాన్ని ఇట్టే కనుక్కోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
ప్రజలు తమకు సమీపంలో ఉన్న ఆధార్ సెంటర్ వివరాలను రాష్ట్రం, పిన్ కోడ్, సెర్చ్ బాక్స్‌ల వారీగా వెదకవచ్చు. ఈ క్రమంలో రాష్ట్రం వారీగా వెదకాలంటే https://appointments.uidai.gov.in/EACenterSearch.aspx?value=1 అనే లింక్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అదే పిన్‌కోడ్ ప్రకారం తమకు సమీపంలో ఉన్న ఆధార్ కేంద్రాల వివరాలు కావాలంటే https://appointments.uidai.gov.in/EACenterSearch.aspx?value=2 అనే లింక్‌ను సందర్శించాలి. ఇక సెర్చ్ బాక్స్ ప్రకారం ఆధార్ సెంటర్ వివరాలను తెలుసుకోవాలంటే https://appointments.uidai.gov.in/EACenterSearch.aspx?value=3 అనే లింక్‌ను ఓపెన్ చేయాలి.
ఇక ఆధార్ సెంటర్ వద్ద సహజంగానే భారీ క్యూలు ఉంటాయి. అందుకని ఆ క్యూలను తప్పించుకుని మనకు అనువుగా ఉన్న సమయంలోనే సెంటర్‌కు వెళ్లి ఆధార్ వివరాలను మార్చుకోవాలంటే అందుకు ముందస్తుగా అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
* https://appointments.uidai.gov.in/bookappointment.aspx?AspxAutoDetectCookieSupport=1 అనే లింక్‌ను ఓపెన్ చేయాలి.
* అందులో సిటీ లేదా ప్రాంతాన్ని ఎంచుకోవాలి. అపాయింట్మెంట్ను బుక్ చేసుకునేందుకు ముందుకు ప్రొసీడ్ అవ్వాలి.
* మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. కాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. తరువాత మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
* ఓటీపీని సబ్మిట్ చేశాక ఆధార్ వివరాలను నమోదు చేయాలి. వ్యక్తిగత సమాచారం ఇవ్వాలి.
* ఏ తేదీన ఏ సమయంలో ఆధార్ సెంటర్‌కు వస్తారో తెలపాలి.
* అన్ని వివరాలను ఇచ్చి ముందుకు వెళితే అపాయింట్మెంట్ బుక్ అయి ఒక నంబర్ వస్తుంది.
దీంతో పౌరులు తమకు సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి ఎలాంటి క్యూలోనూ నిలబడాల్సిన పనిలేకుండా నేరుగా స్లాట్ ప్రకారం కేంద్రంలో ఆధార్ సేవలను పొందవచ్చు. నిర్దిష్టమైన చార్జిలను చెల్లించి ఆధార్ సేవలను పొందేందుకు అవకాశం ఉంటుంది.
అయితే ఈ సేవను ఉపయోగించుకోవాలంటే ఆధార్‌లో కచ్చితంగా మొబైల్ నంబర్ అప్డేట్ అయి ఉండాలి. దీంతో అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఆధార్ సెంటర్‌ను సందర్శించడం తేలికవుతుంది.