ఇల్లు కొనే వాళ్ళు అపార్ట్మెంట్లు తప్పకే కొంటున్నారా…? ఎందుకు ఇష్టపడటం లేదు…?

-

సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రతీ ఒక్కరి కల… అందుకోసం ఆర్ధిక ప్రణాళిక చేసుకుని… ఏళ్ళ తరబడి తిని తినక రూపాయి రూపాయి వెనకేసుకుని దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నగరాల్లో ఉండే వారు అయితే అద్దులు కట్టలేక ఎక్కువగా సొంత ఇంటి మీదే మొగ్గు చూపుతారు… అందుకోసం తమ సొంత ఊరులో ఉన్న ఆస్తులను కూడా అమ్మే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ క్రమంలో అపార్ట్మెంట్ కొనడానికి ఎక్కువగా గతంలో మొగ్గు చూపే వారు… కాని ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారని పరిశీకులు, స్థిరాస్తి వ్యాపారులు అంటున్నారు…

దీనికి కారణం అనేక సమస్యలని అంటున్నారు… సాధారణంగా సొంత ఇంటి మీద హక్కులు ఎక్కువగా ఉంటాయి… కాని అపార్ట్మెంట్ లో ఫ్లాట్ విషయంలో మాత్రం అది ఉండటం లేదట… ఇతరులకు లోబడి బ్రతకాల్సి వస్తుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు. పిల్లలు ఆడుకోవాలన్నా, ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, ఎవరైనా బంధువులు ఎక్కువగా వచ్చినా సరే… పక్క ఫ్లాట్ వాళ్ళతో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయనే భయం ఎక్కువైంది. తమ ఇంట్లో తాము స్వేచ్చగా ఉండే పరిస్థితి చాలా తక్కువగా ఉందనే భావన వారిలో వ్యక్తమవుతుంది.

అదే విధంగా అపార్ట్మెంట్ నాణ్యత విషయంలో కూడా వాళ్ళు భయపడుతున్నారు.. స్థిరాస్తి వ్యాపారులు… వ్యాపారం మీద దృష్టి పెడుతున్నారు గాని నాణ్యత మీద దృష్టి పెట్టడం లేదు. ఇల్లు అనేది భవిష్యత్తు తరాలకు ఇచ్చే ఆస్తి… కాని ఫ్లాట్ అనేది గాలిలో ఉండే ఆస్తి అంటున్నారు. లక్షలు పోసి కొన్న ఫ్లాట్ కి భవిష్యత్తు లేదనే భయం వారిని ఎక్కువగా వెంటాడుతుంది. అందుకే అపార్ట్ మెంట్ విషయంలో ఎక్కువగా భయపడుతున్నారని… ఇండిపెండెంట్ గృహాలకే ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారని స్థిరాస్తి వ్యాపారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version