డెబిట్ కార్డుల వలన అనేక ఉపయోగాలు ఉంటాయి. అయితే వాటిలో యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ సదుపాయం కూడా ఉంటుంది. కానీ చాల మందికి ఈ విషయాలు తెలియవు. ప్రతీ డెబిట్ కార్డు పైన కూడా ఈ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. ఇన్స్యూరెన్స్ ఎంత ఉంటుందన్నది డెబిట్ కార్డుని బట్టి ఉంటుంది. ఏటీఎం, పీఓఎస్, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్స్ లో గత 90 రోజుల్లో వాడాలన్న నిబంధన ఉంటుంది. ఇలా ఉంటే కనుక అది వర్తిస్తుంది.
ఇక ఇన్స్యూరెన్స్ కి సంబంధించి విషయాలని మనం చూద్దాం. దీనిలో మొత్తం రెండు రకాలు ఉంటాయి. ఒకటి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) నాన్ ఎయిర్. మరొకటి పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్). అయితే మరి ఏ ఎస్బీఐ కార్డుపై ఎంత ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందో చూసేయండి.
మీకు కనుక ఎస్బీఐ గోల్డ్ (MasterCard/VISA) ఉంటే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.2,00,000, పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.4,00,000 ఉంటుంది. అదే SBI ప్రైడ్ (Business Debit) MasterCard/VISA అయితే నాన్ ఎయిర్ (డెత్) రూ.2,00,000. ఎయిర్ (డెత్) రూ.4,00,000 ఉంటుంది.
SBI ప్లాటినం (MasterCard/VISA) అయితే నాన్ ఎయిర్ (డెత్) రూ.5,00,000. పర్సనల్ ఎయిర్ (డెత్) రూ.10,00,000. SBI ప్రీమియం (Business Debit) MasterCard/VISA నాన్ ఎయిర్ (డెత్) రూ.5,00,000. ఎయిర్ (డెత్) రూ.10,00,000.
ఇది ఇలా ఉంటే ఎస్బీఐ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు ఉన్న వారికి యాక్సిడెంటల్ డెత్ లేదా టోటల్ డిసేబిలిటీ రూ.2,00,000 కవరేజీ లభిస్తుంది. యాక్సిడెంట్ అయిన 45 రోజుల ముందు డెబిట్ కార్డ్ వాడి ఉండాలి. SBI VISA Signature/MasterCard Debit Card అయితే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.10,00,000. ఎయిర్ (డెత్) రూ.20,00,000.