బాలిక సమృద్ధి యోజన స్కీం కి అప్లై చేయాలా? అర్హత వివరాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడే తెలుసుకోండి..?

-

దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరికి సక్రమమైన చదువు ఉండాలి. అయితే మన దేశంలో ఆడపిల్లలకు రక్షణ మరియు చదువును అందించడానికి ఎన్నో పథకాలను ప్రభుత్వం తీసుకువచ్చింది. వాటిలో భాగంగా బాలిక సమృద్ధి యోజనాని కూడా తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఎవరైతే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలలో చెందిన ఆడపిల్లలు ఉన్నారో వారికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి వాళ్ళ స్కూల్ పూర్తి అయ్యేవరకు కేంద్ర ప్రభుత్వం బాలిక సమృద్ధి యోజన కార్యక్రమం ద్వారా సాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం 1997లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ముందుగా ఆడపిల్ల పుట్టిన వెంటనే తల్లికి 500 రూపాయలను ఇస్తారు. ఆ తర్వాత పదవ తరగతి పూర్తయ్యే వరకు దశల విభాగాలలో సాయాన్ని అందిస్తారు.

అర్హత వివరాలు:

బాలిక సమృద్ధి యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు మాత్రమే దీనిని పొందగలరు. ఈ పథకం ద్వారా ఒక కుటుంబం లో కేవలం ఇద్దరు కుమార్తెలు మాత్రమే అర్హులు. కూరగాయలు, పండ్లు మరియు చిన్న వ్యాపారాలను చేసే కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు కూడా ఈ పథకానికి అర్హులు.

ఎలా అప్లై చేయాలి:

ఈ పథకం కోసం ఆన్లైన్ లేక ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆరోగ్య సేవ కేంద్రాలలో లేక అంగన్వాడీ కార్యకర్త వద్ద పథకానికి సంబంధించిన ఫారం తీసుకొని దానిని పూరించిన తర్వాత ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అయితే గ్రామీణ మరియు పట్టణ ప్రాంత వారికి ఫారం వేరుగా ఉంటుంది. ఈ ఫారం ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడే సబ్మిట్ కూడా చేయాలి. అదే విధంగా ఫారంలో అడిగిన సమాచారాన్ని పూర్తిగా నింపాలి.

పధకం ద్వారా పొందే ప్రయోజనాలు:

  • ఒకటవ తరగతి నుండి మూడవ తరగతి చదువుతున్న వారికి ౩౦౦
  • నాలుగవ తరగతి చదువుతున్న వారికి 500
  • ఐదవ తరగతి చదువుతున్న వారికి 600
  • ఆరు, ఏడవ తరగతి చదువుతున్న వారికి 700
  • ఎనిమిదవ తరగతి చదువుతున్న వారికి 800
  • తొమ్మిది మరియు పడవ తరగతిలో ఉన్నవారికి వెయ్యి రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ గా ఇవ్వడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version