పోస్టాఫీసులో బెస్ట్ స్కీమ్..రోజుకు 417 కడితే..కోటి మీ సొంతం..

-

ఇప్పుడు ప్రతి ఒక్కరూ పోస్టాఫీసు స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు..ఎక్కువ వడ్డీ పొందడంతో పాటు డబ్బులు సేఫ్ గా ఉంటాయి. అందుకే ఈ స్కీమ్ లకు మంచి బెనిఫిట్స్,మంచి డిమాండ్ కూడా ఉంటుంది.భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రావిడెంట్‌ ఫండ్‌ పథకం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఈ పథకంలో పన్ను ప్రయోజనం కూడా పొందవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసులో పబ్లిక్‌ ప్రవిడెంట్‌ ఫండ్‌ స్కీమ్‌ వల్ల మంచి బెనిఫిట్స్‌ పొందవచ్చు. ఇందుకోసం మీరు ప్రతిరోజూ రూ.417 ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈ అకౌంట్‌ మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. మీరు దానిని 5 సంవత్సరాల చొప్పున రెండుసార్లు పొడిగించవచ్చు.

ఇన్వెస్టర్లు పీపీఎఫ్‌ ఖాతాల్లో సంవత్సరానికి రూ.500 తక్కువగా, ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్ అనేది భారతదేశంలో అత్యధికంగా వడ్డీ ఉంటుంది. పీపీఎఫ్‌ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఇది బ్యాంకుల ఎఫ్‌డీల కంటే చాలా ఎక్కువ..నెలలో రూ. 12500 రూపాయలు అంటే రోజుకు రూ. 417 డిపాజిట్‌ చేయాలి. ఈ మొత్తం పెట్టుబడి 22.50 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో మీరు 7.1 శాతం వార్షిక వడ్డీతో ప్రయోజనం పొందుతారు. ఇందులో వడ్డీగా రూ.18.18 లక్షల వరకు వస్తుండగా, మొత్తం 40.68 లక్షల రూపాయలు లభిస్తాయి. అపై మెచ్యూరిటీ కాలాన్ని ఒక్కొక్కటి ఐదు సంవత్సరాల చొప్పున రెండు సార్లు పొడిగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

35 సంవత్సరాల వయస్సు నుండి 60 సంవత్సరాల వయస్సు వరకు, అంటే 25 సంవత్సరాల వరకు ఇలా చేస్తే, మెచ్యూరిటీ సమయంలో మీకు వచ్చే మొత్తం రూ. 1.03 కోట్ల వరకు ఉంటుంది..జీతం పొందేవారు, స్వయం ఉపాధి పొందేవారు, పెన్షనర్లు ఎవరైనా సరే పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్‌ ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఒక వ్యక్తి ఒక ఖాతాను మాత్రమే ఓపెన్‌ చేయగలడు. ఇందులో జాయింట్‌ ఖాతా ఉండదు. పిల్లల తరపున తల్లిదండ్రులు/సంరక్షకులు పోస్టాఫీసులో మైనర్ పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు…ఇందులో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఈ స్కీమ్ లు నచ్చితే మీరు కూడా ఇన్వెస్ట్ చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version