ఈపీఎఫ్ పెన్షన్ PPO నెంబర్‌ను తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇలా ఈజీగా తెలుసుకోండి..!

-

రిటైర్ అయ్యే ప్రతి ఉద్యోగికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ యొక్క వివరాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పంపుతుంది. ఈపీఎస్ పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు ప్రత్యేకమైన PPO నెంబర్‌ను ఇస్తుంది. పీపీవో నెంబర్ పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందే వాళ్ళు పక్కాగా తెలుసుకోవాలి.

పీపీవో నెంబర్ పెన్షన్ పొందడానికి సహకరిస్తుంది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ 12 అంకెలు తో ఉంటుంది. అయితే ఈ పన్నెండు అంకెల్లో మొదటి అయిదు అంకెలు పీపీవో జారీ చేసే అథారిటీ కోడ్‌ను సూచించగా.. నెక్స్ట్ రెండు అంకెలు నెంబర్ జారీ చేసిన సంవత్సరాన్ని సూచిస్తాయి.

ఆ తర్వాత నాలుగు అంకెలు పీపీవో సీక్వెన్షియల్ నెంబర్, చివరి అంకె కంప్యూటర్ చెక్ కోడ్‌ను ఇండికేట్ చేస్తుంది. ఈ నెంబర్ కనుక లేదూ అంటే లైఫ్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చెయ్యడం అవ్వదు. అలానే పీపీవో నెంబర్ తెలియక పోతే పీఎఫ్ ఖాతాకు ఒక బ్యాంకు శాఖ నుండి మరో బ్యాంకుకు బదలీ చేయడంలో ఇబ్బందులు వస్తాయి. ఇక ఈ నెంబర్ ని ఎలా పొండచ్చో ఇప్పుడు చూద్దాం.

  • దీని కోసం మొదట ఈపీఎఫ్ఓ ఇండియా వెబ్‌సైట్‌లోకి లాగ్-ఇన్ కావాలి.
  • ఆ తర్వాత సర్వీసెస్‌లోని పెన్షన్ పోర్టల్ పైన క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీకు ఒక పేజీ వస్తుంది.
  • కుడివైపున ఉన్న నో యువర్ పీపీవో నెంబర్ పైన క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ బ్యాంకు ఖాతా నెంబర్ లేదా మెంబర్ ఐడీని ఎంటర్ చేయాలి.
  • కొన్ని డీటెయిల్స్ ని కనుక మీరు ఇచ్చారంటే మీకు సమాచారం అందుతుంది.
  • పీపీఎఫ్ నెంబర్‌తో పాటు సభ్యత్వ ఐడీ, పెన్షన్ రకం చెప్పాలి.
  • నెక్స్ట్ మీరు ఇక్కడ పెన్షన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version