పాన్ కార్డు గడువు ఎన్నేళ్లు..? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తోంది..?

-

ప్రతి ఒక్కరికి కూడా పాన్ కార్డు తప్పకుండా ఉంటుంది. పాన్ కార్డ్ విషయంలో కొన్ని పొరపాట్లు చేయడం కూడా మంచిది కాదు. పాన్ కార్డు ఉండడం వలన చాలా లాభాలు ఉంటాయి. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ పాన్ కార్డుని ఒకసారి తయారు చేసిన తర్వాత పాన్ కార్డుని జీవితాంతం చెల్లుబాటు అయ్యే విధంగా ఉంచింది. కాబట్టి పాన్ కార్డుకి ఎక్స్పైరీ డేట్ ఏమీ ఉండదు. ఎప్పుడైనా సరే చెల్లుబాటు అవుతుంది. జీవితాంతం అది చెల్లుబాటు అవుతుంది. పాన్ కార్డు పోయినా లేదంటే పాడైపోయిన సులభంగా డూప్లికేట్ పాన్ కార్డుని తయారు చేయించుకోవచ్చు. NSDL మీకు ఈ అవకాశాన్ని అందిస్తోంది.

పాన్ కార్డు పోయినా లేదంటే డూప్లికేట్ కావాలనుకుంటే ఏ ఇబ్బంది లేకుండా పొందవచ్చు. ఆదాయపు అను శాఖ నిబంధనల ప్రకారం ఓ వ్యక్తికి ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉండడం చట్ట విరుద్ధం. ఇలా ఉన్నట్లయితే జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు. రెండు పాన్ కార్డులను కలిగి ఉన్నట్లయితే ఒక పాన్ కార్డుని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో సరెండర్ చేసేయాలి.

ఆన్లైన్లో మీరు సరెండర్ చేయాలనుకుంటే NSDL వెబ్సైట్లోకి వెళ్లి సరెండర్ చేయొచ్చు. ఫోటో, సంతకం, గుర్తింపు కార్డు వంటి కొన్ని ముఖ్యమైన పత్రాలని ఇవ్వాల్సి ఉంటుంది. సరెండర్ కోసం రుసుము చెల్లించాలి. చెల్లింపు తర్వాత మీరు రసీదుని పొందవచ్చు. ఈ రసీదుని భద్రంగా ఉంచుకోవాలి సరెండర్ చేసిన తర్వాత రెండు ఫోటోగ్రాఫర్లని రసీదు కాపీ తో పాటు ఎన్ఎస్డిఎల్ కార్యాలయానికి పంపించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version