వరంగల్ వెళ్తున్నారా? లక్నవరం సరస్సును చూసేయండి.. కాస్త రిలాక్స్ అవుతారు..!

-

ఏదైనా పనిమీద వరంగల్ వెళితే.. అక్కడి నుంచి లక్నవరం సరస్సును కూడా చూసి రండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు రిలాక్స్ అవుతారు. మన వరంగల్ లో.. ఇంత మంచి టూరిస్ట్ ప్లేస్ ఉందా? అని ఆశ్చర్యపోతారు.

వరంగల్ లేదా ఓరుగల్లు… కాకతీయు పాలకుల రాజధాని. శిల్పకలా సౌందర్యానికి పెట్టిన పేరైన వరంగల్ లో పర్యాటకానికి కొదవ లేదు. కాకతీయులు నిర్మించిన ఎన్నో కట్టడాలు ఇప్పటికీ చారిత్రక కట్టడాలుగా మిగిలిపోయాయి. వాళ్లు నిర్మించిన చాలా ప్రదేశాలు ఇప్పటికీ కొనియాడబడుతున్నాయి. పర్యాటక ప్రాంతాలుగా వర్థిల్లుతున్నాయి. వరంగల్ అంటే చాలామంది చెప్పే నిర్మాణం.. వేయి స్థంభాల గుడి.. ఆ తర్వాత ఖిలా వరంగల్. కానీ.. వరంగల్ లో ఇవే కాకుండా చూసే ప్రదేశాలు చాలా ఉన్నాయి.

వాటిలో అతి ముఖ్యమైనది… చూడదగ్గది.. లక్నవరం సరస్సు. అవును… ఈ సరస్సు ఓ మినీ ఐలాండ్ లా ఉంటుంది. చుట్టూ ప్రకృతి, కొండలు.. మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్.. ఐలాండ్స్ కు వెళ్లడానికి వేలాడే వంతెన.. ఆహా.. లక్నవరం సరస్సు గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఈ సరస్సును కూడా కాకతీయ పాలకులే నిర్మించారు. 13 వ శతాబ్దంలో నిర్మించారు. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. వర్షాకాలం అయినా.. ఎండాకాలం అయినా.. ఏకాలంలో అయినా చూడదగ్గ ప్రదేశం లక్నవరం సరస్సు.

ఏదైనా పనిమీద వరంగల్ వెళితే.. అక్కడి నుంచి లక్నవరం సరస్సును కూడా చూసి రండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు రిలాక్స్ అవుతారు. మన వరంగల్ లో.. ఇంత మంచి టూరిస్ట్ ప్లేస్ ఉందా? అని ఆశ్చర్యపోతారు. జస్ట్.. వరంగల్ సిటీ నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే. గోవిందరావ్ పేట మండలంలో ఈ సరస్సు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 260 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఒక్క రోజులో కూడా ఈ సరస్సును చూసి తిరిగి ఇంటికి చేరుకోవచ్చు. లక్నవరం సరస్సుకు వరంగల్ నుంచి చాలా బస్సులు ఉంటాయి. రవాణా గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు.

కానీ.. తమ జీవితంలో అస్సలు మిస్ చేసుకోకూడని టురిస్ట్ స్పాట్ ఇది. వీలు కుదిరితో ఫ్యామిలీతో కలిసి పిక్ నిక్ వెళ్లినట్టుగానూ వెళ్లి రావచ్చు. అక్కడే చెట్ల మధ్య కాసేపు సేదతీరి.. అక్కడే వండుకొని తిని కూడా రావచ్చు. చాలా మంది టూరిస్టులు.. కావాల్సినవన్నీ తీసుకెళ్లి.. అక్కడే వండుకొని తిని సాయంత్రానికి ఇంటి దారి పడతారు. అటు లక్నవరంను చూసినట్టూ ఉంటుంది.. కాసేపు అడవిలో సేదతీరినట్టూ ఉంటుంది. ఏమంటారు.

ప్రకృతి ప్రేమికులకైతే సూపర్ గా నచ్చేస్తుంది ఈ ప్లేస్. అన్నట్టు లక్నవరంలో బోటు రైడింగ్ కూడా ఉంటుంది. చెరువు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను బోటులో షికారు చేస్తూ వెళ్లి చూసి రావచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version