చెన్నై – సికింద్రాబాద్‌ – చెన్నై స్పెషల్‌ ట్రైన్స్‌

-

రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్ళను నడిపించడానికి రంగం సిద్ధం చేసింది. ఎంజీఆర్‌ చెన్నై–సికింద్రాబాద్‌ మధ్య వారానికి రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ తెలిపారు. చెన్నై సెంట్రల్‌ నుంచి 06059 రైలు వారంలో రెండు రోజులు శుక్రవారం, ఆదివారాలు చెన్నై నుంచి బయల్దేరి శనివారం, సోమవారం చేరుతుంది.

సికింద్రాబాద్‌ నుంచి చెన్నైకు 06060 నెం. రైలు శనివారం, సోమవారం బయల్దేరి ఆదివారం, మంగళవారంలకు చేరుతుంది. ఇలా వారంలో రెండు రోజులపాటు చెన్నై నుంచి సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. చెన్నై, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు, పిడుగురాళ్లు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ల మీదుగా సికింద్రాబాద్‌కు ఈ రైళ్లు నడుస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version