ప్రపంచంలో అతి చిన్న ద్వీపం.. మనుషులు లేరు కానీ రాజు పాలిస్తున్నాడు..!

-

ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి.. వాటిని తెలుసుకోవాలంటే మనకు ఒక జీవితం సరిపోదు. ఒక్క వింత ఒక్క రకమైన అనుభూతని కలిగిస్తుంది. అలాంటి ఓ వింత గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ భూమిపై అతి చిన్న ద్వీపంగా పరిగణించబడే ఒక ద్వీపం ప్రపంచంలో ఉందని ఎవరికైనా తెలుసా. ప్రపంచంలోనే అతి చిన్న రాష్ట్రం అని చెప్పొచ్చు. అవును మరి విశేషమేమిటంటే ఈ రాష్ట్రంలో ప్రజలు లేకపోయినా ఇక్కడ మాత్రం రాజుల సామ్రాజ్యం ఉంది.

ప్రపంచంలోని అతి చిన్న తవోలారా ద్వీపం. సార్డినియాలోని ఇటలీ తీరంలో ఒల్బియా గల్ఫ్‌లో పూర్తిగా బంజరు ద్వీపం. ఈ ద్వీపం పేరు తవోలారా. దీన్ని ప్రపంచంలోనే అతి చిన్న రాష్ట్రం అంటారు. విశేషమేమిటంటే ఈ రాష్ట్రంలో ప్రజలు లేరు. ఇక్కడ రాజులు, రాణులు మాత్రమే ఉన్నారు.

ట‌వోలారా రాజ్యం ఏర్పాటు ఇట‌లీ దేశంగా అవ‌త‌రించ‌క‌ముందు సార్డీనియా రాజ్యంలో ఉండేది. ఆ దేశపు రాజు చార్లో ఆల్బెర్టో. అక్కడ ఎవ్వరైనా సరే ఒక్క పెళ్లి చేసుకోవాలి. రెండు పెండ్లిళ్లు చేసుకోవ‌డం నేరం అని ప్రకటించాడు. దాన్ని అతిక్రమిస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించాడు. కానీ ట‌వోలారా ప్ర‌స్తుత రాజు ఆంటోనియా ముత్తాతకు ముత్తాత గుసెప్పే రెండు పెండ్లిళ్లు చేసుకున్నాడు. దీంతో అతను శిక్ష త‌ప్పించుకోవటానికి త‌న కుటుంబంతో కలిసి 1807లో సార్డీనియా నుంచి పారిపోయి ఈ టవోలారా దీవికి వచ్చేశాడు. ఆ త‌ర్వాత కొంత‌కాలానికి టవోలారా దీవి గురించి సార్డీనియా రాజు చార్లో ఆల్బెర్టోకు తెలిసింది. కానీ ఆ దీవిలో గుసెప్పే ఉన్నాడని తెలియదు. కానీ దీవి గురించి రాజు చార్లో ఆల్బెర్టో ఓ వింత విషయం విన్నాడు.

ట‌వోలారా దీవిలో బంగారు రంగు పళ్లు ఉండే మేక‌లు ఉంటాయ‌ని.. ప్ర‌పంచంలో ఇటువంటి మేక‌లు ఇంక ఎక్కడా లేవని అవి ఇక్క‌డ మాత్ర‌మే ఉంటాయ‌ని ప్ర‌జ‌లు చెప్పుకునేవాళ్లు. దీంతో ఈ వింత మేక‌ల‌ను చూడటానికి సార్డీనియా రాజు 1836లో ఈ దీవికి వ‌చ్చాడు. అక్క‌డికి రాగానే ఆల్బెర్టోకు గుసెప్పే కుమారుడు ప‌వోలో క‌నిపించాడు. తాను సార్డీనియా రాజున‌ని ఆల్బెర్టో ప‌రిచ‌యం చేసుకున్నాడు. కానీ ఆల్బెర్టోకు అతను గుసెప్పే కొడుకని తెలియదు. దీంతో ప‌వోలో ఏం చెప్పాలో అర్థం కాక ‘నేను టవోలారా రాజ్యానికి రాజుని’ అని చెప్పాడు.

ఆ ప‌రిచ‌యం త‌ర్వాత ఆల్బెర్టో మూడు రోజులు అక్కడే ఉండి బంగారు రంగులో ప‌ళ్లున్న మేక‌ల‌ గురించి అడిగాడు. దానికి పవోలో తన గుట్టు బయటపడకుండా జాగ్రత్త పడుతు ఆ బంగారు రంగు పళ్లున్న మేకలను చూపించగా ఆల్బెర్టో వాటిని వేటాడాడు. దానికి ప‌వోలో సాయం చేశాడు. మూడు రోజుల‌ త‌ర్వాత ఆల్బెర్టో ట‌వోలారా దీవి నుంచి సార్డీనియాకు వెళ్లిపోయాడు. ఆతరువాత టవోలారా తమ రాజ్యంలో భాగం కాదని ప్ర‌క‌టించాడు. ఇక అప్పుడు ప‌వోలో ఇక ఈ ట‌వోలారా దీవి నా సామ్రాజ్యం అని నిర్ణయించేసుకుని దాన్ని తన సామ్రాజ్యంగంగా ప్ర‌క‌టించుకున్నాడు. అప్ప‌ట్లో ఆ రాజ్యంలో 33 మంది ఉండేవారు. ఇక్క‌డ విశేషమేంటంటే.. ట‌వోలారాను త‌మ దేశంలో భాగ‌మ‌ని ఇటలీ ఎప్పుడూ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అలాగే టవోలారాను ప్ర‌త్యేక దేశంగా ఎవ‌రూ గుర్తించ‌లేదు. అలా ప్రస్తుతం ఈ సామాజ్యం 11మంది జనాభాతో కొనసాగుతోంది.

ట‌వోలారా రాజ్యానికి చుట్టుప‌క్క‌ల చాలా ర‌కాల స‌ముద్ర జీవులు ఉంటాయి. అరుదైన మేక‌లు, గ‌ద్ద‌లు వంటి పక్షులుంటాయి. వీటిని చూసేందుకు పలు దేశాల నుంచి పర్యాటకు భారీగా తరలివస్తుంటారు టవోలారా దీవికి. పర్యాటకుల కోసం రాజు అత‌ని మేన‌ల్లుడు ప‌డ‌వ నడుపుతుంటారు. మ‌రో మేన‌ల్లుడు రెస్టారెంట్ న‌డుపుతుంటాడు. అక్క‌డే చేప‌లు ప‌ట్టి ప‌ర్యాట‌కుల‌కు వండి పెడుతుంటారు.

ప్ర‌స్తుతం ఇదే ఈ రాజుగారి జీవ‌నాధారం. ఈ రాజుగారికి ఒక వింత అలవాటుంది. పొద్దున్నే లేవ‌గానే శ్మ‌శాన వాటిక‌కు వెళ్తాడు. ఆ శ్మశానం రాజు కుటుంబానికి చెందినదే. అక్క‌డ త‌న భార్య స‌మాధిపై నిజమైన పువ్వులు కాకుండా ప్లాస్టిక్ పూలు పెట్టి నివాళుల‌ర్పిస్తాడు. ఆ తరువాతే ఏపనిచేసినా. స‌మాధిపై ప్లాస్టిక్ పూలే పెట్ట‌డం వెనుక కూడా ఒక కార‌ణం ఉంది. స‌మాధిపై పెట్టిన పూల‌ను ఇక్క‌డి అరుదైన మేక‌లు తినేస్తున్నాయంట‌. అందుకే మేక‌లు తిన‌కుండా ఉండటానికి రాజుగారు ప్లాస్టిక్ పూల‌ను పెడుతుంటారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version