భార్యాభర్తల విడాకుల కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. భర్తతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి భార్య నిరాకరించడం మానసిక క్రూరత్వమేనని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో భర్త ఆమెతో విడాకులు కోరవచ్చని పేర్కొంది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఈ కారణం సరైనదేనని.. ఇది చట్టబద్ధమైన విడాకుల దావాకు దారితీస్తుందని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది.
ఎక్కువ కాలం శృంగారానికి నిరాకరించడం ద్వారా భార్య తనను మానసికంగా వేధిస్తున్నదని ఓ వ్యక్తి విడాకులకు అప్లే చేశాడు. అయితే ఆ వ్యక్తికి విడాకులు ఇచ్చేందుకు భోపాల్‌లోని ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది. నవంబర్ 2014లో జస్టిస్ షీల్ నాగు, వినయ్ సరాఫ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. చట్టబద్ధమైన కారణం లేదా శారీరక అసమర్థత లేకుండా ఏకపక్షంగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి నిరాకరించడం మానసిక క్రూరత్వంగా పరిగణించబడుతుందని తమకు తెలుసని వ్యాఖ్యానిస్తూ అయినా విడాకులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన బాధితుడి పిటిషన్పై విచారణ చేపట్టిన మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం కుటుంబ న్యాయస్థానం తీర్పును రద్దు చేసి, కొట్టివేసింది.