మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఉన్న మొబైల్ నెంబర్ అప్డేట్ చెయ్యాలనుకుంటే ఇలా చెయ్యండి..!

-

మీరు మీ ఎస్‌బీఐ(sbi) అకౌంట్‌కు ఉన్న మొబైల్ నెంబర్ అప్‌డేట్ చెయ్యాలనుకుంటున్నారా..? అయితే ఇలా ఈజీగా చేసేయచ్చు. పైగా దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో వుండే ఇలా ఈజీగా అప్డేట్ చెయ్యచ్చు. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

ఎస్‌బీఐ /sbi

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అకౌంట్ ఉందా? మీ అకౌంట్‌లో మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటున్నారా? అయితే ఇలా ఆన్‌లైన్‌లోనే ఈజీగా మొబైల్ నెంబర్ మార్చొచ్చు. ఓటీపీ ద్వారా మొబైల్ నెంబర్ అప్‌డేట్ ఈజీగా చేయొచ్చు.

దీని కోసం మొదట మీరు https://www.onlinesbi.com/ ఓపెన్ చేయాలి.
ఇప్పుడు మీ వివరాలతో అకౌంట్‌లో లాగిన్ అవ్వండి.
ఎడమవైపు My Accounts and Profile పైన క్లిక్ చేయాలి.
నెక్స్ట్ డ్రాప్‌డౌన్ మెనూలో Profile పైన క్లిక్ చేయాలి.
ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీరు ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. (లాగిన్ సమయంలో ఉపయోగించిన పాస్‌వర్డ్ కాదు. గతంలో క్రియేట్ చేసుకున్నది)
తర్వాత Change Mobile Number-Domestic only పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు కొత్త స్క్రీన్ పైన పర్సనల్ డీటెయిల్స్-మొబైల్ నెంబర్ అప్‌డేట్ అని కనిపిస్తుంది.
ఆ తర్వాత మీ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. కొత్త మొబైల్ నెంబర్ మరోసారి ఎంటర్ చేయాలి.

ఫైనల్ గా సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలని పాప్ అప్ మెసేజ్ కనిపిస్తుంది. OK పైన క్లిక్ చేయాలి.
మీకు ఇప్పుడు ఓటీపీ, ఏటీఎం, కాంటాక్ట్ సెంటర్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.
By OTP on both the Mobile Number అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీ అకౌంట్ సెలెక్ట్ చేయాలి.
ఏటీఎం కార్డు సెలెక్ట్ చేయాలి. మీ ఏటీఎం కార్డు నెంబర్, వేలిడిటీ, కార్డ్ హోల్డర్ పేరు, పిన్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ఓటీపీ, రిఫరెన్స్ నెంబర్ మీ పాత మొబైల్ నెంబర్‌కు వస్తుంది
ఆ తర్వాత ACTIVATE అని టైప్ చేసి 8 అంకెల ఓటీపీ టైప్ చేసి 13 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
ఇలా మీ మొబైల్ నెంబర్ ని అప్డేట్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version