స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త లోన్ స్కీమ్..!

-

కస్టమర్స్ కి దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI గుడ్ న్యూస్ చెప్పింది. దీని వలన చాలా మందికి బెనిఫిట్స్ కలుగనున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

కొత్త లోన్ స్కీమ్ అందుబాటులోకి తీసుకు వచ్చింది ఎస్బీఐ. ఈ స్కీమ్ పేరు ఆరోగ్యమ్ లోన్. ఇది కొత్త బిజినెస్ లోన్ స్కీమ్. మరి దీని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి..?, ఎవరు అర్హులు..? మొదలైన విషయాల కోసం కూడా చూసేయండి.

ఈ స్కీమ్ అనేది ఒక బిజినెస్ లోన్ స్కీమ్. ఇందులో భాగంగా హెల్త్ ‌కేర్ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు సులభంగా రుణాలు పొందొచ్చు అని స్టేట్ బ్యాంక్ అంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి.

అందు కోసమే ఎస్బీఐ ఈ కొత్త లోన్ స్కీమ్ తీసుకు వచ్చింది. క్యాష్ క్రెడిట్, టర్మ్ లోన్, బ్యాంక్ గ్యారంటీ, లెటర్ ఆఫ్ క్రెడిట్ వంటి వాటి రూపంలో ఈ కొత్త బిజినెస్ లోన్ తీసుకోవచ్చు అని ఎస్‌బీఐ చెప్పడం జరిగింది. అయితే రూ.2 కోట్ల వరకు లోన్ పొందే వారు ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ తెలిపింది.

హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, డియాగ్నస్టిక్ సెంటర్లు, పాథాలని ల్యాబ్స్, మ్యనుఫ్యాక్చరర్స్, సప్లయర్స్, ఇంపోర్టర్స్, హెల్త్ కేర్ సప్లై లాజిస్టిక్ సంస్థలు వంటివి రూ.100 కోట్ల వరకు రుణం పొందొచ్చు.

ఈ రుణాన్ని పదేళ్ల లోపు మళ్లీ తిరిగి చెల్లించాలి. హెల్త్ ‌కేర్ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు సులభంగా రుణాలు కొత్త స్కీమ్ తీసుకు వచ్చామని ఎస్‌బీఐ అంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version