మ్యూచుఫల్ ఫండ్స్: నెల నెలా పెట్టుబడి పెడితే వచ్చే లాభాలు..

-

ఒక ఐదు సంవత్సరాల క్రితం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత జట్టు క్రికెటర్లు మ్యూచువల్ ఫండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా వస్తుంటే సామాన్యులకి సైతం దీని మీద దృష్టి మళ్ళింది. ఐతే మ్యూచువల్ ఫండ్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి అంశం.. స్టాక్ మార్కెట్.

ఈ పేరు చెబితే చాలు చాలా మంది పక్కకు తప్పుకుంటారు. మార్కెట్లో ఉండే ఒడిదొడుకులే దీనికి కారణం. ఐతే మ్యూచువల్ ఫండ్స్ కి స్టాక్ మార్కెట్ కి సంబంధం ఉన్నప్పటికీ, దానిని నిర్వహించేవారు ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. అలాగే మ్యూచువల్ ఫండ్లలో పెట్టే పెట్టుబడి 20-25కంపెనీల స్టాకుల్లోకి వెళ్తుంది. అంటే మన పెట్టుబడి పెరగాలంటే ఆ కంపెనీల స్టాక్స్ అన్నీ పెరగాలి. అలాగే నష్టపోవాలంటే అన్ని స్టాకులు తగ్గాలి.

అదంతా అటుంచితే, అసలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి ఎన్ని రకాలుగా పెడ్తారో తెలుసుకోవాలి.

ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఇందులో ఉంది. దాంతో పాటు నెల నెలా చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. నెల నెలా పెట్టే ఈ పెట్టుబడి విధానాన్ని సిప్ అంటారు. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్.

ప్రతీ నెల ఒక ప్రత్యేకమైన తేదీన బ్యాంకు ఖాతాలో నుండి మనం ఎంచుకున్న అమౌంట్ మ్యూచువల్ ఫండ్లలోకి వెళ్ళిపోతుంది. వెయ్యి రూపాయల నుండి ఎంతైనా పెట్టుకునే అవకాశం ఉంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు అంతకన్నా తక్కువ అమౌంట్ కి సిప్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

దీనివల్ల కలిగే ఉపయోగాల్లో కొన్ని:

సామాన్యులకి కూడా పెట్టుబడి పెట్టుకునే అవకాశం..
మార్కెట్లో వచ్చే ఒడిదొడుకుల కారణంగా కలిసి వస్తుంది.

చక్రవడ్డీ..
ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకునే అవకాశం.
ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దానికోసం డబ్బు దాచే ప్రయత్నం.
ఎక్కువ రోజులు పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం వచ్చే అవకాశాలు తగ్గడం.
చిన్న మొత్తాలు కాబట్టి మానసికంగా పెద్ద బరువుగా అనిపించకపోవడం..

గమనిక: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకి అనుగుణంగా ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు స్కీముకి సంబంధించిన డాక్యుమెంట్లు చదవండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version