ఇండియాలో 90 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య!

-

భారత్ లో కరోనా విజృంభిస్తూనే ఉంది. మొదట్లో లాక్ డౌన్ లో ఉండడంతో కరోనా కేసులు కంట్రోల్ లోనే ఉండేవి. కానీ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అన్నీ వదిలేయడంతో రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా తొంభై వేలకు దగ్గరలో నమోదవుతున్న కేసులు కొద్ది రోజులుగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మళ్ళీ కేసులు పెరిగాయి. గడచిన 24 గంటలలో 83,347 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,085 మంది మృతి చెందారు.

దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,646,011కు చేరగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా 9,68,377 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 45,87,614కు చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 90,020కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 81.23 శాతానికి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news