మన్సాస్ ట్రస్ట్ వివాదం : హైకోర్టులో అశోక్ గజపతిరాజు భారీ ఊరట

-

మాన్సస్ ట్రస్టు వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ ట్రస్టు వివాదం.. ముదురుతోంది.  అయితే తాజాగా మాన్సా స్ ట్రస్టు వారసత్వ వివాదం పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ట్రస్టు వివాదం పై ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నే ట్రస్ట్ చైర్మన్ గా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు… అనుబంధ పిటిషన్లను కొట్టి వేసింది. సంచయిత మరియు ఊర్మిళ గజపతి రాజు లు వేసిన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా పిటీషన్ దారులకు… వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు.  కాగా ఇటీవలే మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు తొలగించి తనను నియమించాలని ఊర్మిళ గజపతి రాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news