నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 579 అడుగులు(280.1200 టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి మొత్తం 19792 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ను ఉత్పత్తి చేయడం ద్వారా 38832 క్యూసెక్కుల నీరు సాగరకు వచ్చి చేరుతుంది.