ఐపీఎల్ 2020లో నేడు ఏడవ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ టాస్ నెగ్గింది. దీంతో కెప్టెన్ కెఎల్ రాహుల్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగ చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెండు జట్లు కూడా ఇప్పటి ఒక్కో మ్యాచ్ ఆడాయి.
అయితే ఈ రెండు జట్లు కూడా ఓటమి పాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్ లో నెగ్గి ఈ ఐపీఎల్ సీజన్ లో బోణి కొట్టాలని రెండు జట్లు కూడా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. కాగ ఈ మ్యాచ్ లో ఇరు జట్ల తుది జట్లు ఇలా ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు :
రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా ( కెప్టెన్ ), ఎంఎస్ ధోని ( వికెట్ కీపర్ ), శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, డ్వైన్ ప్రిటోరియస్, ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్పాండే
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు :
కెఎల్ రాహుల్ ( కెప్టెన్ ), క్వింటన్ డి కాక్ ( వికెట్ కీపర్ ), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్