ఏపీ గ్రామ వాలంటీర్ల నియామకాలకు నోటిఫికేషన్.. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే?

-

ఎంపికైన అభ్యర్థులకు వారం పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణలో ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ అనంతరం.. వాళ్లకు కేటాయించిన గ్రామాల్లో వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది.

ఏపీలోని గ్రామ వార్డు వాలంటీర్ల నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వాలంటీర్ల నియామకం కోసం.. గ్రామం, మున్సిపల్ వార్డును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని.. ఆ మండల పరిధిలో నియమించే వాలంటీర్ల సంఖ్య లెక్కిస్తారు. ఆ తర్వాత ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తారు. అన్ని విభాగాల్లో సగం మంది మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీవో అప్లికేషన్లను పరిశీలిస్తారు. అర్హులైన అభ్యర్థులను మండల స్థాయిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.

ఈ నియామకాల కోసం పట్టణాలు, మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కమిటీలను నియమించనున్నారు. పట్టణ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ చైర్మన్‌గా ఉంటారు. తహసిల్దార్, జిల్లా కలెక్టర్ నియమించే మరో అధికారి సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీవో చైర్మన్‌గా ఉంటారు. తహసిల్దార్, ఈవోపీఆర్‌డీ సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీలే అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక పరిస్థితులపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక స్పృహ లాంటి అంశాలపై ఇంటర్వ్యూ ఉంటుంది. వాలంటీర్లుగా ఎంపికైన వాళ్లకు ప్రతి నెలా 5 వేల రూపాయల గౌరవ వేతనాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఎంపికైన అభ్యర్థులకు వారం పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణలో ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ అనంతరం.. వాళ్లకు కేటాయించిన గ్రామాల్లో వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది.

అప్లయి విధానం

జులై 5 వరకు వాలంటరీ ఉద్యోగం కోసం అప్లయి చేసుకోవచ్చు. 10 జులై వరకు అప్లికేషన్లను పరిశీలిస్తారు. జులై 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 5 నుంచి 10 వరకు శిక్షణ ఉంటుంది. 15 ఆగస్టు నుంచి గ్రామ వాలంటీర్లు విధుల్లో చేరాలి.

Read more RELATED
Recommended to you

Latest news