ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలనీ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఇంగ్లీషులోనూ తెలుగులోనూ ఉత్తర్వులు జారీ చేసింది సాధారణ పరిపాలన శాఖ. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయనీ పేర్కొన్న ప్రభుత్వం.. 90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకం అని పేర్కొంది.
మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం గాఏపీలో తెలుగు భాషా సమగ్రత కు ఇలా ఉత్తర్వులు జారీ చేయడం తోడ్పడుతుందని పేర్కొన్న ప్రభుత్వం.. ఆంగ్లం, తెలుగు రెండు భాషల్లోనూ ఉత్తర్వులు జారీ చేయాలని వివిధ శాఖలకు ఆదేశాలు ఇచ్చింది. మొదట మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు జారీ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సిందిగా.. ఆ తర్వాత రెండు రోజుల్లోగా తెలుగులోనూ అదే ఉత్తర్వు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖలకు సూచనలు ఇచ్చింది సాధారణ పరిపాలన శాఖ. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో అనువదించడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది ప్రభుత్వం.