నా భర్త డబ్భులు సంపాదించే వాడు కాదు అందుకే

-

సీనియర్ నటి కారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నటి ప్రగతి ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్ట్ గా  సినిమాల్లో బిజీ గా వున్న సంగతి తెలిసిందే.వయసు పెరుగుతున్న కొద్దీ , తన గ్లామర్ ను పెంచు కుంటు అందరిని అలరిస్తోంది. తాను మాస్ బీట్ పాటలకు వేసే డాన్స్ ల ,అలాగే తాను జిమ్ లో చేసే వర్కౌట్ వీడియోస్ సోషల్ మీడియాలో లో హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ప్రముఖ ఛానల్ లో ఇంటర్వ్యూ సందర్భంగా తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేసింది.

అందులో భాగంగా నేను 20 సంవత్సరాల వయస్సులో వున్నప్పుడే నాకు ప్రపోజ్ చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. అలాగే పెళ్ళి విషయంలో మా అమ్మ అనుమతి కూడా తీసుకోలేదు. వెంటనే అతని ద్వారా బాబును కూడా కనడం జరిగిందని తెలిపింది. కొన్ని రోజులు బాగానే గడిచి పొయాయి.

ఆ తర్వాత నాకు అసలు కష్టాలు స్టార్ట్ అయ్యాయని, నా భర్త ఏ సంపాదన లేకుండా వుండే వాడని, అసలు కుటుంబం గురించి పట్టించు కోలేదని చెప్పింది. దానితో నేను హీరోయిన్ గా కూడ బెట్టుకున్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయాయని చెప్పుకొచ్చింది. దానితో  కుటుంబం గడవక ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడాకుల తీసుకోవడం జరిగిందని తెలిపింది. ఆ సమయంలో విడాకుల ద్వారా మళ్లీ నా భవిష్యత్ నాలుగు రోడ్ల కూడలి లో వున్న మాదిరిగా అయ్యిందని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news