మోక్షజ్ఞ మొదటి సినిమా డైరెక్టర్ అతనేనా.. !

-

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతను మరెవరో కాదు.. నందమూరి నటసింహ బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ. నిజానికి మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ పై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే దానిపై ఇప్పటి వరకు బాలయ్య నుంచి క్లారిటీ రాలేదు. అసలే విషయంపై బాలకృష్ణ ఓ క్లారిటీ ఇచ్చేశారు..

నందమూరి అభిమానుల నిరీక్షణకు తరలించారు బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ ఎంట్రీ పై ఓ క్లారిటీ ఇచ్చేశారు.. ఇటీవల గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న బాలయ్య.. ఇండస్ట్రీలో కుమారుడి ఎంట్రీపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వచ్చేయడాది మోక్షజ్ఞ టాలీవుడ్కు పరిచయం కానున్నారని తెలిపారు..

కృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే.. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని వార్తలు వినిపించినప్పటికీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.. అయితే బోయపాటి కథను ఇప్పటికే రెడీ చేసుకొని ఉన్నట్టు బాలకృష్ణ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే లేట్ అని తెలుస్తుంది.. ఏమవుతుంది అన్నది తెలియాలి అంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.. అలాగే మోక్షజ్ఞను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసేది బోయపాటి శ్రీను అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయాన్ని బాలయ్యను అడగగా.. అడగగా అంత దైవ నిర్ణయం అంటూ నవ్వుతూ బదులిచ్చారు బాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news