తాజ్ హోటల్‌లో ఎంపీలకు దావత్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ !

-

ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలవనున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

Pawan Kalyan giving dawat to MPs at Taj Hotel

అటు ఇవాళ ఉదయం 9 గంటలకు భూపేంద్ర యాదవ్ తో సమావేశం కానున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్‌.. విందు ఏర్పాటు కూడా చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు ఇవాళ పవన్ కళ్యాణ్ విందు ఇవ్వనున్నారు. తాజ్ హోటల్‌లో విందు ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎంపీలతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఆహ్వానం పంపారు పవన్.

Read more RELATED
Recommended to you

Latest news