ఏపీ విద్యార్థులకు అలర్ట్‌..రేపు ఐసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్‌… రేపు ఐసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల కానుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నిన్న జరిగిన ఐసెట్ పరీక్షకు 44,343 మంది హాజరయ్యారు. 49,162 మంది దరఖాస్తు చేసుకోగా, 90.20% హాజరు నమోదయింది.

ఈ నెల 26న ఐసెట్ ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ‘కీ’పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 28 సా. 6 గంటలలోపు https://cets.apsche..ap.gov.in/ICET/ వెబ్సైట్ ద్వారా తెలపాలని అధికారులు సూచించారు. కాగా, ఇవాళ తెలంగాణ ఎంసెట్​ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు వెల్లడిస్తామని మంగళవారం ప్రకటించిన అధికారులు.. అదే సమయంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం ఉండటం, దానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి ఉండటంతో ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు జరిపారు.

Read more RELATED
Recommended to you

Latest news