BREAKING : వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారట పిల్లి సుభాష్ చంద్రబోస్. త్వరలోనే జనసేన గూటికి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌ను సైతం ఖాళీ చేసే ప్రయత్నాల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారట.
కుమారుడు పిల్లి సూర్య ప్రకాశ్ కు జనసేన టికెట్ ఖరారు అని ప్రచారం జరుగుతోంది. రామ చంద్రాపురం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండనున్నారట పిల్లి సూర్య ప్రకాశ్. ఈ మేరకు జనసేనలోకి వెళ్ళేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. రామచంద్రాపురం నియోజకవర్గం టికెట్ వచ్చే అవకాశం లేదని తేలటంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది.