BRS MLA మాగంటి ఇంట్లో ఐటీ సోదాలు

-

BRS MLA మాగంటి ఇంట్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో పాటు సోదరుడు, ఆయన బంధువుల ఇళ్ళలో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

IT searches at BRS MLA Maganti's house
IT searches at BRS MLA Maganti’s house

ఇది ఇలా ఉండగా, ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నగరంలోని పలు కంపెనీలతోపాటు వాటి యజమానుల ఇళ్లలో ఆదయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ తనీఖీల్లో 100 బృందాలు పాల్గొంటున్నట్లు సమాచారం.

మరోవైపు.. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎంపీ ఎస్‌. జగత్‌రక్షకన్‌ ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైతోపాటు కోయంబత్తూరు, వేలూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జగత్‌రక్షకన్‌కు చెందిన విద్యాసంస్థల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. పలు హోటళ్లు, ప్రైవేట్‌ దవాఖానలపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news