అమెజాన్‌ అటవీ ప్రాంతంలో కూలిన విమానం.. 12 మంది దుర్మరణం

-

బ్రెజిల్‌లోని అమెజాన్‌ అటవీ ప్రాంతంలో చిన్న విమానం కుప్పకూలిన ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు,. ఓ పసికందు సహా 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సింగిల్ ఇంజిన్ సెస్నా కారవాన్ అనే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రియో బ్రాంకోలోని విమానాశ్రయం సమీపంలో కుప్పకూలినట్లు సమాచారం. విమానం కుప్పకూలిన చోట పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కార్చిచ్చుగా మారినట్లు ఎకర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారు ఎకర్ పొరుగున ఉన్న అమెజోనాస్‌ రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లారని.. చికిత్స చేయించుకున్న తర్వాత తిరుగుముఖం పట్టారని తెలిపింది. ఈ క్రమంలోనే అమెజాన్ అటవీ ప్రాంతంలో రియో బ్రాంకోలోని విమానాశ్రయం సమీపంలో అకస్మాత్తుగా విమానం కుప్పకూలినట్లు వెల్లడించింది. గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అప్పటికే 12 మంది దుర్మరణం చెందినట్లు రెస్క్యూ టీమ్ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news