కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు తెలంగాణలో నిరసన సెగ తగిలింది. తెలంగాణలో డీకే శివకుమార్‌ను ప్రచారానికి తీసుకు రావద్దు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
తెలంగాణలో ఆ మధ్య ప్రచారానికి వచ్చి కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నాం అని నోరు జారిన డీకే శివ కుమార్ వ్యాఖ్యలు డ్యామేజ్ చేయడంతో మళ్లీ ప్రచారానికి రావద్దని వేడుకుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు. మరోవైపు తెలంగాణలో ప్రచారానికి వచ్చినపుడు కర్ణాటకలో ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టి తన సీటుకు ఎసరు పెట్టడంతో ఆలోచనలో పడ్డారు డీకే శివ కుమార్.
ఇక అటు కర్ణాటక రైతులకు శుభవార్త చెప్పారు సీఎం సిద్దరామయ్య. ఎంత ఖర్చయినా ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొని కర్ణాటక రాష్ట్రంలోని రైతులకు రెండు విడతల్లో ఏడు గంటల విద్యుత్ సరఫరా చేసి తీరుతామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఇటీవల విద్యుత్ కోతలతో సంక్షోభం ఎదుర్కొంటున్న కర్ణాటక రాష్ట్రంలో సీఎం సిద్దరామయ్య, విద్యుత్ శాఖా మంత్రి కేజే జార్జ్ నిన్న రివ్యూ సమావేశం నిర్వహించి ఎట్టిపరిస్థితుల్లో రెండు విడతల్లో రైతులకు ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.