తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ పై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి అభిప్రాయ సేకరణకు పనికి వస్తుందే తప్ప… పూర్తి ఫలితాలకు కొలమానం కాదు…కొంత మేర మాత్రమే అభిప్రాయం వస్తుందని తెలిపారు. జిల్లాల్లో తెల్ల రాయి అక్రమ రవాణా పై టిడిపి నేత సోమిరెడ్డి హడావిడి చేస్తున్నారని..అక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పారని ఫైర్ అయ్యారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
మైన్ యజమానులు కలసిన తరువాత దాని గురించి మాట్లాడటం లేదు…గనుల యజమానుల నుంచి మామూళ్లు తీసుకున్నారని మండిపడ్డారు. 14 మందికి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు…వీరితో ఒప్పందం కుదరడంతో ఇప్పుడు సిలికా పై పడ్డారని ఆగ్ర హించారు. ఈ విషయం పై తిరుపతి కలెక్టర్ ను కూడా కలిశారు… అక్కడా ఒప్పందం కుదిరిందేమో..అందుకే ఆ విషయాన్ని కూడా మళ్లీ మాట్లాడటం లేదన్నారు. కిరాయికి రాజకీయాలు చేస్తున్నారు…బెదిరింపులు..బ్లాక్ మెయిల్ లు ఆయనకు అలవాటేనని ఆగ్రహించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.