మున్సిపల్ కార్మికులకు రూ.6 వేలు అలవెన్స్ ప్రకటించింది జగన్ సర్కార్. అయితే.. ఇవాళ కూడా మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటలకు కార్మిక సంఘాలతో జీవోఎం భేటీ కానున్నారు. ఏపీ సచివాలయంలోని సెకెండ్ బ్లాక్ లో ఈ సమావేశం జరుగనుంది. సమాన పనికి సమాన వేతనం పై పట్టుబడుతోంది సీఐటీయూ.
మున్సిపల్ వర్కర్స్ పలు డిమాండ్ల పై సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం. కార్మిక సంఘాల డిమాండ్ మేరకు మరికొన్ని క్యాటగిరీలకు కూడా ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తూ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్స్, శానిటేషన్ వెహికల్ డ్రైవర్స్, మలేరియా వర్కర్స్ కు నెలకు 6 వేల రూపాయల ఓహెచ్ అలవెన్స్ ఇస్తూ జీవో కూడా ఇచ్చేసింది. ఇక ఇవాళ మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.