సంక్రాంతి పండుగ.. ప్రయాణికులకు RTC గుడ్ న్యూస్

-

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే 6,795 స్పెషల్ బస్సులను సిద్ధం చేయగా…. వాటిలో హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసమే 1,600 బస్సులను కేటాయించింది. తాజాగా హైదరాబాద్ నుంచి అదనంగా మరో 1,000 బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది.

పండుగ తర్వాత తిరిగి వెళ్ళే వారి కోసం కూడా మరిన్ని సర్వీసులు కేటాయిస్తామని తెలిపింది. వీటన్నింటిలో సాధారణ చార్జీలే ఉంటాయని పేర్కొంది. ఇక అటు పండుగలకు వెళ్లే వారికి సూచనలు చేశారు పోలీసులు. బంగారు, వెండి ఆభరణాలు, డబ్బును బ్యాంకు లాకర్లలో భద్ర పర్చుకోవాలని లేదంటే వెంట తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు. ఇంటికి సెక్యూ రిటీ అలారం, మోషన్‌ సెన్సర్‌, సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ ఉండే తాళం అమర్చుకోవాలని చెప్పారు. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలని.. చక్రాలకు గొలుసులతో తాళం వేయాలని సూచనలు జారీ చేశారు. అపార్ట్‌మెంట్ల దగ్గర , ఇంట్లో సీసీకెమెరాలను ఆన్‌లైన్‌ ద్వారా ఎప్పటికప్పుడు చూడాలని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news