Hanuman: ‘హనుమాన్ దెబ్బ’ కేజీఎఫ్, కాంతార రికార్డులు అబ్బా.. పుష్పతో సమానంగా కలెక్షన్స్

-

హీరో తేజ సజ్జా నటించిన తాజా చిత్రం హనుమాన్ . ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ నీ సొంతం చేసుకుంది .ఈ చిత్రం ముఖ్యంగా నార్త్ సర్కిల్లో భారీ మొత్తంలో వసూళ్లు రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. తరణ్ ఆదర్శ్ ఈ సినిమా ఒక సరికొత్త రికార్డు నమోదు చేసిందంటూ ట్విట్టర్(ఎక్స్) లో పోస్ట్ చేశాడు. కేజిఎఫ్ మొదటి పార్ట్, కాంతారా వసూళ్ల కంటే ఎక్కువగా, పుష్ప మూవీతో ఈక్వల్ గా ఈ మూవీ నార్త్ లో భారీ వసూళ్లు రాబడుతోందంటూ తెలిపారు. ఈ 2024 సంవత్సరానికి ఈ సినిమా మొదటి హిట్గా నిలిచిందని ఇంకా రాబోయే రోజుల్లో కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

 

బాలీవుడ్ లో శుక్రవారం రోజు రెండు కోట్ల 15 లక్షలు, శనివారం నాలుగు కోట్ల ఐదు లక్షలు , ఆదివారం రోజు 6 కోట్ల ఆరు లక్షలు ,మొత్తం 12 కోట్ల 26 లక్షలు దాకా కేవలం హిందీ వర్షన్ లోనే వసూళ్లు చేసినట్లు ప్రకటించారు. ఇక ఉత్తర భారత దేశంలో విడుదలైన తెలుగు వెర్షన్ కి శుక్రవారం 24 లక్షలు, శనివారం 40 లక్షలు, ఆదివారం 45 లక్షలు మొత్తం కోటి 9 లక్షల రూపాయలు వసూళ్లు సాధించింది అని వెల్లడించారు . హను మాన్ మరిన్ని రికార్డులు బద్దలు కొడుతూ భారీ మొత్తంలో వసూలు చేస్తుందని తరుణ్ ఆదర్శ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news