మహాశివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధి లో మూడు రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించే మహా జాతరకి ఎప్పుడు లేని విధంగా ఏర్పాట్లు చేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చెప్పారు శివరాత్రి రోజున అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని సమర్పించారు.
ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు పూర్ణ కుంభం తో ఘన స్వాగతం పలికారు తర్వాత ఆదియోగి ఉత్సవమూర్తి వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి జాతరనే ప్రారంభించారు ఆర్టీసీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సర్వీస్ ని ఎమ్మెల్యే రోహిత్ ప్రారంభించారు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.