ఫోన్ టాపింగ్ వ్యవహారం మీద గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు గాంధీభవన్లో మీడియాతో అయన మాట్లాడారు బిఆర్ఎస్ నాయకులు మీద ఫైర్ అయ్యారు భద్రతకి ఉపయోగించాల్సిన ఫోన్ టాపింగ్ ని రాజకీయాల లబ్ది కోసం వాడుకుని ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని ఆయన అన్నారు.
కేటీఆర్ తప్పు చేయకపోతే దాంట్లో ఆయన ప్రేమేయం ఏమి లేకపోతే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు పదేపదే ఫోన్ టాపింగ్ గురించి ఎందుకు తీస్తున్నారని ఇది చాలా చిన్న సమస్య అన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. దీనికి పూర్తి బాధ్యులైన కేటీఆర్ హరీష్ రావు ఇంకా దీనికి పాల్పడ్డ వారు ఎవరైనా తప్పనిసరిగా శిక్షించబడతారని అన్నారు బల్మూరి వెంకట్.