నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రేపు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇన్స్టా లైవ్లో మాట్లాడుతూ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ నటించారని తెలిపారు. సినిమాలో భాగమైనందుకు వారిద్దరికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లా వైరల్ గా మారింది. ఇప్పటికే అర్జునుడిగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ప్రత్యేక పాత్రలో నటించారని పలువురు పోస్టులు చేశారు. కాగా ఈ చిత్రం లో అమితాబ్, కమల్‌హాసన్, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన ట్రైలర్ ,పోస్టర్స్, గ్లింప్స్‌లకు మంచి స్పందన వచ్చింది.