Sanju Samson: సంజూకు షాక్‌..జట్టు నుంచి తొలగించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్?

-

సంజూకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది రాజస్థాన్‌. ఐపీఎల్ ఆరంభ సీజన్ లో దివంగత షేన్ వార్న్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత మరోసారి కప్పును గెలవలేదు. కెప్టెన్లు మారినా… ఆటగాళ్లు మారినా… ఎన్ని ప్రయోగాలు చేసినా మరోసారి కప్పు సొంతం చేసుకోవాలనుకునే కళ నిజం కాలేకపోతుంది. ఐపీఎల్ 2025లో ఎలాగైనా విజేతగా నిలవాలని ప్రణాలికలను రచిస్తోంది. ఈ సీజన్ కన్నా ముందు జరగనున్న మెగా వేలంపై దృష్టి పెట్టినట్లుగా సమాచారం.

Sanju Samson To Leave Rajasthan Royals

కొత్త కెప్టెన్ ను నియమించాలని చూస్తున్నట్టుగా అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంజు శాంసన్ జట్టును వీడనున్నాడనే టాక్ నడుస్తోంది. కాగా ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్టులు ప్రస్తుతం వైరల్ గా మారాయి. సంజు శాంసన్ కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. మేజర్ మిస్సింగ్ అని ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదండోయ్ ఏడుస్తున్న ఎమోజీని జత చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని బట్టి చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ ను సంజు శాంసన్ జట్టును వీడడం ఖాయంగా ఉందని పలువురు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news