వర్షాలపై సీఎం రేవంత్ అలెర్ట్…వాళ్లకు సెలవులు రద్దు !

-

వర్షాలపై సీఏం రేవంత్ అలెర్ట్ అయ్యారు…తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్‌ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని ఆదేశాలు జారీ చేశారు.

cm revanth reddy on telangana rains

అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో అంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఏంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్న సీఎం రేవంత్‌…. అత్యవసర పనుకుంటే తప్పా ప్రజలు బయటకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా అంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించిన ముఖ్యమంత్రి రేవంత్… మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. 24 గంటలు అలెర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news