రేపటి నుంచి బాధితుల ఖాతాల్లో రూ.10వేలు : మంత్రి తుమ్మల

-

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. జిల్లాలోని పలుగ్రామాలు జలమయం అయ్యాయి. దీంతో ముంపునకు గురైన గ్రామాల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇళ్లల్లోకి నీరు చేరడంతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇంట్లోని వస్తువులు అన్నీ పాడవ్వడంతో తమను ఆదుకోవాలని రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.

అయితే, తక్షణ సాయం కింద రూ.10వేలు అందిస్తామని, మొత్తం నష్టం అంచనా వేశాకనష్టపరిహారం చెల్లిస్తామని రేవంత్ సర్కార్ చెబుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి వరద బాధితులకు రూ.10వేలు బాధితుల ఖాతాల్లో వేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గత పదేళ్లలో ఇలాంటి వరదలను ఎన్నడూ చూడలేదని మంత్రి తెలిపారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని 10 బృందాలు రంగంలోకి దిగి ఇంటింటి సర్వే చేస్తున్నాయని మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news