రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయ్యిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకోలేదని, రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదని ఆయన మండిపడ్డారు.కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు అసలు విడిచిపెట్టేది లేదని కేటీఆర్ మరోసారి స్ఫష్టంచేశారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాన్ని అంగీకరించడానికి ఇంకెంత మంది రైతులు చావాలని? ఆయన ప్రశ్నించారు.
మేడ్చల్‌లో దుబ్బాక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య తన హృదయాన్ని కలిచివేసిందని, ఇలాంటి బాధలు రావొద్దనే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. రైతు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కేటీఆర్, రైతు వేదన వివరించలేదని వెల్లడించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.