ఇందిరమ్మ రాజ్యం కాదు.. ‘నఫ్రత్ కా బజార్’ : బండి సంజయ్ ట్వీట్

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం పేరుతో ‘నఫ్రత్ కా బజార్’ నడుపుతున్నదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత వచ్చిన ఉద్యోగ అవకాశం మళ్లీ రాదని, తెలుగు అకాడమీ పుస్తకాలు చెల్లవని అంటున్నారని ఓ గ్రూప్స్ ఉద్యోగ అభ్యర్థి రోదిస్తున్న వీడియోను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ చేసిన బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ముసుగులో విద్వేషాల బజార్ తెరిచిందని విమర్శించారు. ఈ బాధ మిమ్మల్ని కదిలించకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమేనా? ఇదేనా ప్రజాపాలన? అని ప్రశ్నించారు. ఇక భవిష్యత్ తరం వీధుల్లో లాఠీలు..క్రూరత్వంతో విలపిస్తున్నప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం గురించి మాట్లాడే హక్కు మీకు లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ రేవంత్ రెడ్డి సర్కారు అవలంభిస్తున్న విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news