తగ్గేదెలే..డేవిడ్ వార్నర్‌కు అల్లుఅర్జున్ బర్త్ డే విషెస్

-

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ‘మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మై బద్రర్’ అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చారు. డేవిడ్ వార్నర్ మైదానంలో తగ్గేదెలే స్వాగ్ స్టైల్ పోస్టర్‌ను సైతం అందులో యాడ్ చేశారు. ప్రస్తుతం బన్నీ చేసిన పోస్టు గురించి నెట్టింట వైరల్ అవుతోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ ఆడినప్పటి నుంచి ఇక్కడి నెటివిటీగా ఎక్కువగా ఆయన కనెక్ట్ అయ్యారు. ఇక పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇందులోని తగ్గేదెలే డైలాగ్.. శ్రీవల్లి పాటకు వార్నర్ పలుమార్లు యాక్ట్ చేశారు. దీంతో బన్నీ, వార్నర్ మధ్యలో ఒక బాండింగ్ అనేది ఏర్పడింది. గతంలో బన్నీ పుట్టిన రోజు సందర్భంగా వార్నర్ సైతం విషెస్ తెలిపిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news