అత్యంత కాలుష్య భరిత నగరంగా లాహోర్..1900 ఏక్యూఐ క్రాస్!

-

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత నగరంగా పాకిస్తాన్‌లోని లాహోర్ నిలిచింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా చరిత్రలోనే తొలిసారిగా అక్కడ గాలి నాణ్యత (ఏక్యూఐ) 1900లకు చేరింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. 400ఏక్యూఐ దాటితే తీవ్ర ప్రమాదం వాటిల్లనుంది. శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులతో మానవాళికి ముప్పుగా మారనుంది కాలుష్యం. ప్రస్తుతం లాహోర్‌లో 4 రెట్ల వాయు కాలుష్యం పెరిగి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత నగరంగా ఓ చెత్త రికార్డ్‌ను కూడా నమోదుచేసింది.

ఇక భారతదేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఢిల్లీలో ఇటీవల ఏకంగా 500 ఏక్యూఐని దాటేసింది. పీఎం వాల్యూ కూడా 2.5 దాటేసింది. దీంతో ఢిల్లీ ప్రజలు మాస్క్ లేనిదే బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇదే ప్రజాజీవనానికి చాలా ప్రమాదకరం అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. పంట వ్యర్థ్యాల కాల్చివేత, క్రాకర్స్ పేల్చడం వలన కాలుష్యం మరింతగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news