కార్తీక మాసంలో నది స్నానం చేయడానికి ఎంతో ప్రాధాన్యతని చాలా మంది ఇస్తూ ఉంటారు. అయితే కార్తీకమాసంలో నది స్నానం ఎందుకు చేయాలి..? దానికి విశిష్టత ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇది ఒక పవిత్రమైన ఆచారం. శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి, మనసుకు శాంతి కలగడానికి దీనిని చేస్తారు. కార్తీకమాసంలో తలస్నానం చేసి పూజలు, దీపారాధన చేయడం వలన పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. సుఖసంతోషాలు కలుగుతాయి.
కార్తీక మాసంలో రోజూ స్నానం చేసి దీపారాధన చేసి, పూజలు చేయడం వలన అనేక లాభాలను పొందవచ్చు. కార్తీకమాసంలో స్నానం చేస్తే పాప విముక్తి కలుగుతుంది. సుఖశాంతులు కలుగుతాయి. కార్తీక మాసంలో భగవంతుడి పూజకు ప్రత్యేకంగా నది స్నానం చేసి పూజించడం వలన భక్తుల పాపాల నుంచి బయటపడొచ్చు. పరమేశ్వరుడికి గంగాజలం, పాలు సమర్పిస్తే పుణ్యం కలుగుతుందట.
కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేస్తే ఆధ్యాత్మిక పవిత్రతని పొందడానికి అవుతుంది. గోదావరి, గంగ, యమున, కృష్ణ వంటి పవిత్ర నదులు స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. నదులుకి వెళ్లలేని వాళ్ళు గంగాజలం కలిపినా నీటితో స్నానం చేస్తే మంచిది. కార్తీకమాసంలో నది స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. స్నానం చేసాక దీపారాధన చేయాలి. దీపం వెలిగించడం వలన శ్రేయస్సు, సుఖశాంతులు కలుగుతాయి.